శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 జనవరి 2023 (17:29 IST)

ఇషాన్ కిషన్‌తో కలిసి స్టెప్పులు ఇరగదీసిన విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్

Ishant_Kohli
Ishant_Kohli
శ్రీలంక జట్టుపై భారత్ అద్భుత విజయాలను సొంతం చేసుకుంటోంది. సొంతగడ్డపై లంకేయులకు టీమిండియా ఆటగాళ్లు చుక్కలు చూపించారు. జనవరి 12న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో వన్డేలో శ్రీలంకపై టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 
 
తద్వారా వన్డే సిరీస్‌తో భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ అద్భుతమైన డ్యాన్స్‌తో ఈడెన్ ప్రేక్షకులను అలరించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.  
 
అయితే  రెండో వన్డేలో విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాడు. కానీ మ్యాచ్ తర్వాత సూపర్ డ్యాన్స్‌తో ఇరగదీశాడు.

స్టాండ్స్ ముందు ఇషాన్ కిషన్‌తో కలిసి స్టెప్పులేశాడు. ఇద్దరు ఆటగాళ్లు తమ ప్రతిభను ఇలా కనబరచడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.