మంగళవారం, 5 నవంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 జనవరి 2023 (22:44 IST)

రెండు కాళ్లు లేకపోతేనేం.. రెండు చేతులుంటే చాలవా?

Zion Clark
Zion Clark
అమెరికాకు చెందిన అంప్యూటీ అథ్లెట్ జియాన్ క్లార్క్ ప్రపంచ రికార్డుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. పుట్టుకతోనే రెండు కాళ్లు లేకుండా పుట్టిన మిస్టర్ క్లార్క్ అథ్లెటిక్స్‌లో తన ప్రాణాలను పణంగా పెట్టి రికార్డులు సృష్టిస్తున్నాడు. 
 
కాళ్లు లేకుండా చేతులతో అత్యంత వేగంగా నడక వ్యాయామం చేసి గిన్నిస్ రికార్డు సృష్టించాడు. 2021లో, అతను 20 మీటర్ల దూరాన్ని 4.78 సెకన్లలో అధిగమించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేరాడు. 
 
తాజాగా ఈ వీడియోను ఇటీవలే విడుదల చేసిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్.. "రెండు చేతులతో అత్యంత వేగంగా నడిచే వ్యక్తి జియాన్ క్లార్క్‌ను చూడండి" అని పేర్కొంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.