ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 జూన్ 2022 (17:51 IST)

నెల్లూరులో దారుణం: మూఢనమ్మకాలతో బిడ్డనే చంపేశాడు!

crime scene
నెల్లూరులో దారుణం చోటుచేసుకుంది. మూఢనమ్మకంతో కూతురినే చంపేశాడు.. ఓ కిరాతక తండ్రి. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని పేరారెడ్డిపల్లిలో ఆర్ధికంగా నష్టపోయిన వేణుగోపాల్ అనే వ్యక్తి మూఢనమ్మకాలతో తనకు చుట్టుకున్న చెడును వదిలించుకునే క్రమంలో కన్నకూతురు ప్రాణాలకే ముప్పు తెచ్చాడు. 
 
తనకు పట్టిన చెడు వదిలించుకునేందుకు మూడేళ్ల కూతురును పూజగదిలో ఉంచి పసుపునీళ్లు పోశాడు. అనంతరం నోట్లో కుంకుమ కుక్కాడు. దీంతో ఆ చిన్నారి ఊపిరాడక కేకలు పెట్టింది. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని ఆ కసాయి తండ్రి నుంచి కూతురుని రక్షించేందుకు విఫలయత్నం చేశారు. 
 
వెంటనే ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు. పరిస్ధితి విషమం కావడంతో నెల్లూరు, అనంతరం చెన్నైకు కూడా తరలించినా ఆ చిన్నారిని బతికించలేకపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.