సోమవారం, 4 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 జనవరి 2023 (17:26 IST)

ఏం కొట్టాడబ్బా.. ధోనీలా శుభమన్ గిల్.. పోల్చిన సంజయ్ మంజ్రేకర్

subhman gill
కివీస్ తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. 
 
శుభ్‌మన్ గిల్ తన తొలి వన్డే డబుల్ సెంచరీని నమోదు చేయడంతో పాటు సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్, ఇషాన్ కిషన్ వంటి వారితో పాటు డబుల్ సెంచరీలతో భారత బ్యాటర్‌ల ఎలైట్ లిస్ట్‌లో చేరాడు. 
 
ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు. గిల్ 19 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 208 పరుగులు చేసి కివీస్ బౌలర్లకు చెలరేగిపోయాడు.
 
దీంతో ఈ 23 ఏళ్ల బ్యాటర్ శుభ్ మన్ గిల్ మాజీ ఆటగాళ్ల నుండి భారీ ప్రశంసలను అందుకుంటున్నాడు. తాజాగా, మాజీ భారత ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ కూడా గిల్‌ను ప్రశంసించాడు. టీమిండియా మాజీ కెప్టెన్  మహేంద్ర సింగ్ ధోనీలా.. శుభ్ మన్ గిల్ కు నిలకడగా నేరుగా సిక్సర్లు కొట్టగల సామర్థ్యం ఉందని పేర్కొన్నాడు.
 
"నేను ధోనిని మొదటిసారి చూసినప్పుడు అతను ఎక్కువగా స్ట్రెయిట్ సిక్సర్లు కొట్టినప్పుడు అతను పెద్ద హిట్టింగ్ విషయంలో స్థిరంగా ఉంటాడని నాకు చెప్పాడు. గిల్‌కి కూడా అదే టాలెంట్ వుందని" మంజ్రేకర్ ట్వీట్ చేశాడు.