గురువారం, 12 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 జనవరి 2023 (14:04 IST)

జిమ్ లో విరాట్ కోహ్లీ.. చూసేందుకు ఎగబడిన ఫ్యాన్స్

Kohli
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇటీవల హైదరాబాద్‌లోని మణికొండలో కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
విరాట్ కోహ్లీ ఓ ప్రకటన షూటింగ్ కోసం మణికొండలోని జిమ్ ను సందర్శించాడు. క్రికెట్ స్టార్ అభిమానులు అతనిని చూడటానికి ఎగబడ్డారు. చాలామంది వారి మొబైల్ కెమెరాల ద్వారా అతని క్షణాలను తీయడానికి జిమ్‌కి వెళ్లారు.
 
వైరల్ వీడియోలో విరాట్ తన వాహనం నుండి దిగి జిమ్‌లోకి ప్రవేశించారు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
విరాట్ కోహ్లీ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మైదానంలో ఉన్నా, బయట ఉన్నా అతడిని చూసేందుకు అతని అభిమానులు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు.