మంగళవారం, 16 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 19 జనవరి 2023 (12:00 IST)

కీలక సన్నివేశాల్లో మహేష్‌బాబు, త్రివిక్రమ్‌ సినిమా

mahesh 28
mahesh 28
మహేష్‌బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ మరో సారి రిపీట్‌ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా షూటింగ్‌ హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్‌లో జరుగుతుంది. నిన్ననే ఏకాదశి రోజు ముహూర్తం షురూ చేశారు. అదే రోజు హైదరాబాద్‌ శివార్లో చిరంజీవి సినిమా బోలాశంకర్‌ కూడా మొదలైంది. ఇక మహేష్‌ బాబు సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. అతడు, ఖలేజా తర్వాత మహేష్‌బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ కనుక మంచి చిత్రం అవుతుందని నిర్మాత నాగవంశీ తెలియజేస్తున్నారు.
 
ఇంతకుముందు షెడ్యూల్‌లో యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరించారు. ఇప్పుడు కూడా కొంత యాక్షన్‌, కొంత టాకీ తీస్తున్నారు. ఇది మహేష్‌బాబుకు 28వ సినిమా కావడంతో సంగీతం, పాటలపై మరింత కేర్‌ తీసుకోబోతున్నట్లు ఇప్పటికే సంగీత దర్శకుడు థమన్‌ తెలియజేశారు.