ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 2 జనవరి 2023 (11:33 IST)

మహేష్ బాబు ఫౌండేషన్ వెబ్ సైట్ ప్రారంభం

Mahesh Babu
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎందరో పిల్లలకు తన సహాయ హస్తం అందించి ఎంతో మంది ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం మరికొందరికి సాయం చేసేందుకు సై అంటున్నాడు. న్యూ ఇయర్ సందర్భంగా, ఆపదలో ఉన్న పిల్లలకు సహాయం చేయడానికి మహేష్ బాబు తన ఫౌండేషన్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. 
 
మహేష్ బాబు కుమార్తె సితార ఒక నెల పాకెట్ మనీని ఫౌండేషన్‌కి విరాళంగా అందించింది. పేద పిల్లలకు సాయం చేసేందుకు ప్రతి ఒక్కరికి సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. 
 
"పిల్లలు జీవించి అభివృద్ధి చెందే ప్రపంచాన్ని సృష్టించే మా ప్రయత్నంలో, ఈ నూతన సంవత్సరంలో మా అధికారిక వెబ్‌సైట్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉంది! http://maheshbabufoundation.org పిల్లల కోసం... పిల్లలకు #MBFoundation శుభాకాంక్షలు" అని బాబు ఫౌండేషన్ ట్వీట్ చేసింది.