సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 డిశెంబరు 2022 (13:20 IST)

చంద్రబాబు సభలకు జనాలు రావడం లేదు.. సీఎం జగన్

jagan
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న రోడ్‌షోలకు, సభలకు జనాలు రావడం లేదని, తక్కువగా వచ్చిన జనాన్ని ఎక్కువగా చూపేందుకు నానా తంటాలు పడుతున్నారని ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలో ప్రతి ఒక్కరినీ మోసం చేసిన చంద్రబాబు సభలకు జనాలు ఎందుకు వస్తారని ఆయన ప్రశ్నించారు. 
 
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వైద్య కాలేజీ నిర్మాణానికి ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.500 కోట్లతో ఈ కాలేజీని నిర్మించనున్నారు. అలాగే, రూ.470 కోట్లతో నిర్మించే తాండవ - ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధాన ప్రాజెక్టు పనులు, రూ.165 కోట్లతో నర్సీపట్నం రహదారి విస్తరణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. 
 
ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తూ, గత పాలకులు ఈ ప్రాంతాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. వైకాపా పాలనలో నర్సీపట్నం రూపురేఖలను మార్చబోతున్నామని చెప్పారు. తాను ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నామన్నారు. చేసేదే తాము చెబుతామన్నారు. జగన్ మా నాయకుడు అని గర్వంగా చెప్పుకునేలా పాలన చేస్తామన్నారు. 
 
రాష్ట్రంలో చెడిపోయిన రాజకీయ వ్యవస్థ తయారైందన్నారు. చంద్రబాబు తన పాలనలో ఒక్ మంచి పనైనా చేశారా? అని ప్రశ్నించారు. దత్తతండ్రి చంద్రబాబును నెత్తిన పెట్టుకుని దత్తపుత్రుు పవన్ కళ్యాణ్ ఊరేగుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు డైలాగులకు పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చేస్తారంటూ విమర్శించారు.