'తిట్టు తిట్టు - పోస్టు పట్టు'.. కొత్త స్కీమ్ ప్రారంభించిన సీఎం జగన్ : ఆర్ఆర్ఆర్ వ్యంగ్యాస్త్రాలు
ప్రభుత్వం అందించే పెన్షన్లపై విపక్షాలు, మీడియా చేస్తున్న చేస్తున్న దుష్ప్రచారాన్ని కలెక్టర్లు తిప్పికొట్టాలని, ముఖ్యంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తిట్టాలంటూ కలెక్టర్లకు ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన సూచనపై పలువురు పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వారిలో వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు కూడా ఉన్నారు. జగన్ రెడ్డి పాలనలో తిట్టు తిట్టు పోస్టు పట్టు కార్యక్రమం కొనసాగుతుందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
విపక్ష నేతలను తిట్టాలంటూ కలెక్టర్లకు జగన్ రెడ్డి చెబుతున్నారని, కలెక్టర్లు ఎవరినైనా తిడితే దాని పరిణామాలు వేరే విధంగా ఉంటాయని రఘురామ స్పష్టం చేశారు. పెన్షన్లలో ఆరు నెలల కింద ఉన్న అర్హత ఇపుడు ఎలా పోతుందని ఆయన ప్రశ్నించారు. పాలకులు తప్పులు చేస్తూ మీడియాపై నిందలు మోపడం సరికాదన్నారు. పెన్షన్లు పెంచుతున్నామని చెప్పి ప్రజలను పాలకులు మోసం చేశారన్నారు.