శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 17 నవంబరు 2022 (09:38 IST)

సారాతో ప్రేమాయణం వార్తలపై క్లారిటీ ఇచ్చిన శుభ్‌మన్ గిల్

sara alikhan - shubhman gill
బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్‌తో తాను ప్రేమలో మునిగితేలుతున్నట్టు మీడియాలో వస్తున్న వార్తలపై భారత క్రికెటర్ శుభ్‌మన్ గిల్ ఓ క్లారిటీ ఇచ్చారు. సారా గురించి మొత్తం నిజం చేప్పేశాను.. నేను సారాతో డేటింగ్‌లో ఉండొచ్చు.. ఉండకపొవచ్చు అని అన్నాడు. 
 
పైగా, బాలీవుడ్‌లో అత్యంత ఫిట్‌గా ఉండే నటి ఎవరు అని అడిగిన ప్రశ్నకు కూడా గిల్ క్షణం ఆలస్యం చేయకుండా సారా పేరు చెప్పేశాడు. దీంతో గిల్ సారాల మధ్య నిజంగానే ప్రేమాయణం సాగుతున్నట్టు ఆయన పరోక్షంగా నిర్ధారించారు. అయితే, గిల్ చేసిన కామెంట్స్‌పై సారా అలీఖాన్ మాత్రం ఇప్పటివరకు పెదవి విప్పలేదు. 
 
ఇదిలావుంటే, శుభ్‌మన్ గిల్ గతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఇపుడు బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్‌తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు రావడం గమనార్హం. పైగా, గత కొన్ని రోజులుగా వీరిద్దరూ ఎయిర్‌పోర్టులు, మాల్స్, థియేటర్స్, ఇతర ఫంక్షన్ల వద్ద జంటగా కెమెరా కంటికి చిక్కుతున్నారు. దీంతో వీరిద్దిర మధ్య ప్రేమ కొనసాగుతున్నట్టు మీడియా కోడైకూస్తోంది.