గురువారం, 9 ఫిబ్రవరి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated: సోమవారం, 14 నవంబరు 2022 (11:18 IST)

తనకంటే చిన్నవాడైన ప్రియుడిని పెళ్లాడిన డోనాల్డ్ ట్రంప్ కుమార్తె

TiffanyTrump marriage
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్ర్ంప్ కుమార్తె టిఫానీ ట్రంప్ తన ప్రియుడిని పెళ్లి చేసుకున్నారు. ఫ్లోరిడాలోని తమ ఫ్యామిలీ క్లబ్‌సో వీరిద్దరి వివాహం జరిగింది. వరుడు చేతికి కుమార్తె చేతిని డోనాల్డ్ ట్రంప్ ఒక తండ్రిగా అందించి ఈ వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. 
 
ట్రంప్ ఏకైక కుమార్తె టిఫానీ ట్రంప్ (29) గత కొన్నేళ్లుగా తన ప్రియుడు మైఖేల్ బౌలస్ (25)తో ప్రేమలో మునిగితేలున్నారు. వయసులో తన కంటే నాలుగేళ్లు చిన్నవాడు అయినప్పటికీ అతన్నే పెళ్లి చేసుకునేందుకు టిఫానీ ట్రంప్ ఇష్టపడ్డారు. దీంతో శనివారం సాయంత్ర సౌత్ ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో ఉన్న తమ ఫ్యామిలీ క్లబ్‌లో ఈ వివాహం జరిగింది. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. 
 
ఈ వివాహనికి డోనాల్డ్ ట్రంప్, ఇవాంకా ట్రంప్, జేరేడ్ కష్నర్, మెలానియా ట్రంప్, డోనాల్డ్ ట్రంప్, ఎరిక్ ట్రంప్, బరోన్ ట్రంప్ తదితరులు హాజరయ్యారు. ఈ పెళ్లిని డోనాల్డ్ ట్రంప్ దగ్గరుండి జరిపించారు. టిఫానీ ట్రంప్ పెళ్లి వేదిక వద్దకు చేరుకోగానే ఆమె చేతికి ముద్దుపెట్టిన ట్రంప్.. ఆ తర్వాత కుమార్తె చేతిని వరుడు చేతికి అందించారు.