గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (14:16 IST)

బ్రహ్మానందం హీరోలను తలదన్నే కోటీశ్వరుడు!

bramhi family with chiru
bramhi family with chiru
హాస్య నటుడు బ్రహ్మానందం హీరోలను ధీటుగా రెమ్యునరేషన్‌ తీసుకునేవాడు. అలాంటి బ్రహ్మీ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సినీరంగంలో పలువురు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. మెగాస్టార్‌ చిరంజీవి శుభాకాంక్షలు తెలుపుతూ.. నాకు తెలిసిన బ్రహ్మానందం అత్తిలిలో లెక్చరర్‌. ఈరోజున బ్రహ్మానందం ప్రపంచంలోనే అత్యధిక చిత్రాల్లో నటించి, గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్‌ రికార్డ్స్‌లో ఎక్కిన గొప్ప హాస్య నటుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. అతని మొహం చూస్తేనే నవ్వు వెల్లివిరిస్తుంది. 
ఇలాగే జీవితాంతం నవ్వుతూ, పదిమందిని నవ్విస్తూ వుండాలని బ్రహ్మాండమైన భవిష్యత్‌ వుండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ నా జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్‌ చేశారు.
 
ప్రస్తుతం బ్రహ్మానందం తనకు నచ్చిన పాత్రలను చేస్తూ హాయిగా జీవితాన్ని గడుపుతున్నారు. పెయింటర్‌గా ఆయనకున్న అభిరుచితో కాలం గడుపుతున్న బ్రహ్మానందం రోజుకు లక్ష నుంచి 4 లక్షలు తీసుకునేవాడు రెమ్యునరేషన్‌. అలాంటిది ‘ఐయా ఫైర్‌..’ అంటూ అల్లు అర్జున్‌ నటించిన సినిమాకు కోటి రూపాయలు తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అందుకే ఆయనతో అత్యంత చనువున్న భరణి మాత్రం కోటీశ్వరరావు అంటూ సరదాగా సంబోధిస్తారట. దటీజ్‌ బ్రహ్మానందం.