గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 జనవరి 2023 (15:31 IST)

ముంబై ఎయిర్ పోర్టులో కెమెరాకు ఫోజులిచ్చిన బ్రహ్మానందం

టాలీవుడ్ స్టార్ కమెడియన్,  బ్రహ్మానందం ముంబై ఎయిర్ పోర్టులో కెమెరాకు చిక్కారు. ఎప్పుడూ హీరోయిన్లు, సెలెబ్రిటీ లవర్స్ కనిపించే ముంబై ఎయిర్ పోర్టులో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కనిపించారు. తెల్లటి దుస్తులను, నల్లటి కళ్ల జోడును ధరించి ఆయన ఎయిర్ పోర్టు నుంచి బయట నుంచి వస్తుండగా ఆయనను తమ కెమెరాల్లో బంధించారు. 
 
మాస్క్ వేసుకుని కనిపించడంతో మాస్క్ తీసేసి మరీ ఫోటోకు ఫోజులిచ్చారు బ్రహ్మానందం. వెల్ కమ్ టు ముంబై సార్ అంటూ మరొక వ్యక్తి బ్రహ్మీకి స్వాగతం పలికారు. ఇకపోతే.. ప్రస్తుతం భవానీ ఐపీఎస్, వాల్ పోస్టర్, మైక్ టెస్టింగ్ 143, గజదొంగ వంటి సినిమాల్లో బ్రహ్మానందం నటించారు.