1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated: మంగళవారం, 31 జనవరి 2023 (11:30 IST)

చిరంజీవి క్లాప్‌ తో నాని 30వ సినిమా ప్రారంభం

Chiranjeevi is providing the script
Chiranjeevi is providing the script
నేచురల్‌ స్టార్‌ నాని తన 30వ సినిమాను మంగళవారంనాడు లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో ఉదయమే సినీరంగం ప్రముఖులు హాజరుకాగా దేవుని పటాలపై పూజ నిర్వహించారు. మెగాస్టార్‌ చిరంజీవి దేవుని పటాలపై క్లాప్‌ కొట్టారు. రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్‌ కెమేరా స్విచాన్‌ చేశారు. సి. అశ్వనీదత్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలో జరగనుంది. నాని స్నేహితుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది.  
 
Chiranjeevi is providing the script
Chiranjeevi is providing the script
నాని, మృణాల్ ఠాకూర్, హేషామ్ అబ్దుల్ వహాబ్ కంబినేషన్లో వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్  బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, అతని స్నేహితులు డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్ దీనిని నిర్మిస్తున్నారు.

nani welcoming chiranjeevi
nani welcoming chiranjeevi
త్యరలో ఈ సినిమాకు సంబంధించిన సాంకేతిక సిబ్బంది వివరాలు ప్రకటించనున్నారు. ఇప్పటికే నాని దసరా సినిమా విడుదల సిద్ధంగా ఉంది. ఈ సినిమా పై నాని పూర్తి  నమ్మకంతో ఉన్నారు.