ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 28 జనవరి 2023 (17:44 IST)

రాజమౌళి, మహేష్‌బాబు సినిమాలో సుధీర్‌బాబు ఉంటాడా!

Mahesh Babu
Mahesh Babu
రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌బాబుతో పాన్‌ వరల్డ్‌ సినిమా తీయనున్నాడని తెలిసిందే. ఎప్పటినుంచో చేయాలనుకున్నా ఇద్దరూ బిజీ కావడంతో ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పుడు ఆర్‌.ఆర్‌.ఆర్‌.కు వచ్చిన ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్టలను రాజమౌళి మరింత కేర్‌తో హాలీవుడ్‌ సినిమా చేయనున్నాడు. ఇందులో తన కుటుంబీకులైన టీమ్‌ అంతా వుంటారు.
 
ఇక మహేష్‌బాబుతో భిన్నమైన కథను అదికూడా పురాణాల్లోని ఓ పాయింట్‌ను తీసుకుని రాస్తున్నానని గతంలోనే ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రచయిత విజయేంద్ర ప్రసాద్‌ తెలిపారు. ఇప్పుడు అదే పనిలో వున్నారు. ఆస్ట్రేలియా బాక్‌డ్రాప్‌లో కథ వుండనుందని తెలుస్తోంది. అయితే ఇందులో తానూ నటించాలనుందనీ, అవకాశం రావాలికానీ ఎప్పటినుంచో అభిమానులు కోరిక, నేను మహేస్‌బాబు సినిమాలో నటించాలనుందని ఇటీవలే సుధీర్‌ బాబు తన మనసులోని మాటను వ్యక్తం చేశారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో రాజమౌళి సినిమా సెట్‌పైకి వెళ్ళనుంది.