శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్

కోహ్లీ కేక.. వందతో శతక్కొట్టాడు... నాలుగేళ్ల తర్వాత తీరిన సెంచరీ కరవు

kohli
ఐపీఎల్ టోర్నీలో భాగంగా, గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీతో మెరిశాడు. ప్లే ఆఫ్స్‌ రేసులో చోటు దక్కించుకనేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు మిగిలివున్న రెండు మ్యాచ్‌లలో విజయం అత్యంత గెలుపు. దీనికి తగ్గట్టుగానే సన్రైజర్స్ హైదరాబాద్‌పై విరుచుకుపడింది. 
 
ఇందుకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (6) బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 100) తన వంతు పాత్రను అద్భుతంగా నిర్వర్తించాడు. తొలిబంతి నుంచే బాదుడు ఆరంభించిన అతను చాలా రోజుల తర్వాత సెంచరీ సాధించేవరకు ఆగలేదు. ఆటు కెప్టెన్ డుప్లెస్ (17 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లర్లతో 71) మెరుపు ఆట కూడా తోడవడంతో ఆర్సీబీ 8 వికెట్లతో హైదరాబాద్‌ను ఓడించింది. 
 
63 బంతుల్లో వంద పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, మొత్తంగా ఆరు సిక్సర్లతో 104 పరుగులు చేశాడు. దీంతో లక్ష్య ఛేదనలో 19.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 187 రన్స్ చేసినెగ్గింది. ఫలితంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీకి ఇది ఆరో సెంచరీ కాగా, ఐపీఎల్‌లో అత్యధిక శతకాలు సాధించిన బ్యాటర్ గేల్ సరసన విరాట్ కోహ్లీ నిలిచాడు. 
 
14 పాయింట్లతో టాప్-4లో నిలిచిన ఆర్సీబీ చివరి మ్యాచ్‌ను కూడా తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా సన్ రైజర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. క్లాసెన్ (51 బంతుల్లో 8 ఫోర్లు 104), మార్ క్రమ్ (18), బ్రూక్ (27 నాటౌట్)లతో కీలక భాగస్వామ్యాలు అందించాడు. అయితే చివరి మూడు ఓవర్లలో 26 పరుగులే ఇచ్చిన ఆర్సీబీ బౌలర్లు స్కోరును 200 లోపే పరిమితం చేశారు. 
 
తొలి బంతినే ఫోర్‌గా మలిచిన క్లాసెన్ మధ్య ఓవర్లలో స్పిన్న ధాటిగా ఎదుర్కొని పరుగుల వరద పారించాడు. ఓపెనర్లు అభిషేక్ (11), రాహుల్ త్రిపాఠి (15)లను బ్రేస్వెల్ ఐదో ఓవర్లోనే అవుట్ చేశాడు. అనంతరం బరిలోకి దిగిన క్లాసెన్ ఆరో ఓవర్‌లో 3 ఫోర్లతో పవర్ ప్లేలో జట్టు 19 పరుగులు సాధించింది. ఇదే ఊపులో 24 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేయగా.. కెప్టెన్ మార్ క్రమ్ సహకారంతో మూడో వికెట్‌కు 76 పరుగులు జత చేశాడు. 
 
కర్ల్ శర్మ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో బ్రూక్ 4.6. క్లాసెన్ సిక్సర్‌తో 21 పరుగులు రాగా, స్పిన్నర్ షాబాజ్ ఓవర్లో క్లాసెన్ 6, 6.. బ్రూక్ 4 బాది మరో 19 రన్స్ రాబట్టడంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. ఇక 97 పరుగుల వద్ద భారీ సిక్సర్ బాదిన క్లాసెన్ 49 బంతుల్లోనే శతకం పూర్తి చేసి. అదే ఓవర్ (19వ)లో వెనుదిరిగాడు. అప్పటికి నాలుగో వికెట్‌కు 36 బంతుల్లోనే 71 పరుగులు జత చేరాయి. కానీ చివరి ఓవర్‌ సిరాజ్ 4 పరుగులే ఇవ్వడంతో స్కోరు 190 లోపే ముగిసింది.