మంగళవారం, 23 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 17 మే 2023 (19:03 IST)

అమితాబ్ -అనుష్కలకు లిప్టిచ్చిన బైకర్లకు అపరాధం

amitabh
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, హీరోయిన్ అనుష్క శర్మలకు ఇద్దరు బైకర్లు లిఫ్టు ఇచ్చారు. ఈ ఇద్దరు స్టార్స్ కారు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకునిపోయాయి. దీంతో షూటింగ్ స్పాట్‌కు సకాలంలో చేరుకునేందుకు ఏమాత్రం పరిచయం లేని బైకర్లను లిఫ్టు అడిగి షూటింగ్ స్పాట్‌కు చేరుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
అయితే, ఈ బైకర్లకు ముంబై పోలీసులు తేరుకోలేని షాకిచ్చారు. ఇద్దరు బైకర్లకు అపరాధం విధించారు. ఈ మేరకు ముంబై ట్రాఫిక్ పోలీస్ విభాగం ఆ బైకర్లకు జరిమానా విధించినట్టు ట్విట్టర్‌లో తెలిపారు. అనష్కకు లిఫ్ట్ ఇచ్చిన బైకర్‌కు రూ.10,500 అపరాధం విధించారు. అమితాబ్‌ను బైక్‌పై తీసుకెళ్లిన బైకర్‌కు మాత్రం ఎంత అపరాధం విధించారో తెలియరాలేదు. 
 
ఈ ఇద్దరు సినీ సెలెబ్రిటీలకు లిఫ్టు ఇచ్చిన ఇద్దరు బైకర్లు హెల్మెట్ పెట్టుకోలేదని, దీంతో వారికి జరిమానా విధించినట్టు ముంబై పోలీసులు వివరణ ఇచ్చారు. కాగా, బైకర్స్ హెల్మెట్ ధరించకపోవడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ముంబై పోలీసులు స్పందించారు.