బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 మే 2023 (13:40 IST)

మహేంద్ర సింగ్ ధోనీపై నిషేధం తప్పదా? అంపైర్‌తో 4 నిమిషాలు..?

Dhoni
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫైయర్-1లో అంపైర్‌తో వాగ్వివాదానికి ధోనీ దిగడం ఆ జట్టుకు పెద్ద కష్టం తెచ్చిపెట్టేలా వుంది. అంపైర్‌తో వాగ్వివాదానికి దిగడం ద్వారా నాలుగు నిమిషాల సమయాన్ని వృధా చేశాడు. ఈ విషయాన్ని రిఫరీ సీరియస్‌గా తీసుకున్నారు. 
 
అంతేగాకుండా జరిమానా లేదా ఒక మ్యాచ్ నిషేధం విధించే అవకాశం వుందని తెలుస్తోంది. మే 28వ తేదీన అహ్మదాబాద్ వేదికగా జరుగనున్న తుది పోరులో లక్నో, గుజరాత్ లేదా ముంబైతో చెన్నై తలపడే అవకాశం వుంది. కానీ ఫైనల్‌కు ముందు చెన్నైకి బిగ్ షాక్ ధోనీ వల్ల తప్పేలా లేదు. 
 
ధోనీపై నిషేధంపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఒకవేళ నిషేధం కొనసాగితే.. కీలకమైన మ్యాచ్‌కు మహీ దూరం అయితే చెన్నైకి గట్టి ఎదురు దెబ్బేనని చెప్పుకోవాలి.