రూ.2వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చు..
రూ.2వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకునే ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. బ్యాంకుల్లో ఈ రోజు నుంచి రెండు వేల రూపాయల ఇచ్చి వేరే నోట్లను ప్రజలు పొందవచ్చు.
ఇందుకోసం బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు ఉంటాయి. చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
ఇంకా రూ.2,000 నోట్ల డిపాజిట్ ఇంకా మార్పిడికి నేటి (మే 23) నుంచి సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. కాగా, నేడు రూ.2,000 నోట్ల మార్పిడికి తొలి రోజు కావటంతో బ్యాంకుల వద్ద పెద్ద క్యూలు ఉండే అవకాశాలు ఉన్నాయి.