సంబంధిత వార్తలు
- తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో నాణ్యతా లోపం లేదు : ఏఆర్ డెయిరీ
- అందరూ దొంగలు కాదు కానీ... వైకాపాతో అంటకాగిన వారే.. బొలిశెట్టి సత్యనారాయణ
- నా భర్త ప్రోత్సహించడం వల్లే నగ్నంగా నటించాను : నటి శరణ్య
- మా అన్నయ్య సూర్య నీకే ఇలాంటి కథలు ఎలా వస్తున్నాయ్.. అంటూ హగ్ చేసుకున్నారు : కార్తీ
- చక్కటి జానపద సాహిత్యం, రసానుభూతి కలిగించేలా ప్రణయ గోదావరి గీతం : చంద్రబోస్
జానీ మాస్టర్ ఇష్యూతో బన్నీకి, సుక్కూకు సంబంధం లేదు.. రవి
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై 21 ఏళ్ల అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేసిన తీవ్రమైన వేధింపుల కేసుతో వివాదం సంచలనంగా మారింది. ఆమె మైనర్‌గా ఉన్నప్పటి నుండి అనేక సంవత్సరాలపాటు లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి. జానీ మాస్టర్‌ను పోక్సో చట్టం కింద అరెస్టు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ భార్య అయేషా నటుడు అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ ఇందుకు కారణమని ఆరోపించారు. వారు సదరు మహిళకు మద్దతు ఇస్తున్నారని, జానీ కెరీర్‌కు హాని కలిగించడానికి ఇదంతా చేశారని ఆరోపించారు.
అయితే ఈ ఆరోపణలను పుష్ప 2 నిర్మాత రవి యెర్నేని తీవ్రంగా ఖండించారు. జానీ మాస్టర్, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మధ్య సమస్య వ్యక్తిగత విషయమని.. పుష్ప 2 తో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు.
అల్లు అర్జున్, సుకుమార్‌లను వివాదంలోకి లాగేందుకు ప్రయత్నించడంపై నిర్మాత రవి యెర్నేని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ కేసుకు ఇద్దరికీ ఎలాంటి సంబంధం లేదని అన్నారు.
తర్వాతి కథనం
