1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Ram Charan's Wax Figure Set for Madame Tussauds Singapore

మేడమ్ టుస్సాడ్స్‌లో రామ్ చరణ్ మైనపు విగ్రహం (video)

Ramcharan
ఆర్ఆర్ఆర్‌లో తన అద్భుత నటనకు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన తెలుగు సూపర్‌స్టార్ రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం దక్కనుంది. సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. 
 
దీనికి సంబంధించిన ప్రత్యేక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో చెర్రీ తన ప్రియమైన పెంపుడు కుక్క రైమ్‌తో వేదిక వద్దకు చేరుకున్నట్లు చూపిస్తుంది. ఈ వీడియో క్లిప్‌లో, రామ్ చరణ్ విగ్రహం కోసం తన కొలతలు ఇవ్వడం చూడవచ్చు. అబుదాబిలోని యాస్ ఐలాండ్‌లో జరిగిన ప్రతిష్టాత్మక ఐఫా ఉత్సవం 2024 ఈవెంట్‌లో ఈ ప్రకటన విడుదలైంది.
 
ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో రామ్ చరణ్ తన అభిమానులను ఉద్దేశించి ఇలా పేర్కొన్నాడు "అందరికీ హలో, నేను రామ్ చరణ్‌ని. మేడమ్ టుస్సాడ్స్ కుటుంబంలో చేరడం నాకు చాలా గౌరవంగా ఉంది. మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్‌లోని నా మైనపు బొమ్మ ఏర్పాటు హ్యాపీగా వుంది అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు." అంటూ తెలిపారు.
 
రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం "గేమ్ ఛేంజర్"లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలోని రెండవ సింగిల్ 'రా మచ్చ రా' సెప్టెంబర్ 30 సోమవారం విడుదల కానుంది.
తర్వాతి కథనం
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు.. సోనియా ఎలిమినేషన్