బుధవారం, 25 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 25 సెప్టెంబరు 2024 (17:50 IST)

రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబో మూవీ గేమ్ ఛేంజ‌ర్‌ నుంచి రా మ‌చ్చా మ‌చ్చా ప్రోమో

Ramcharan -macha song
Ramcharan -macha song
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ మీదున్న అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్  నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. 2024 క్రిస్మస్ సందర్భంగా సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.
 
‘గేమ్ ఛేంజ‌ర్‌’ మేక‌ర్స్ మూవీ నుంచి మ‌రో క్రేజీ అప్‌డేట్‌ను ఇచ్చేశారు. సెప్టెంబ‌ర్ 28న సినిమా నుంచి  సెకండ్ సాంగ్ ‘రా మ‌చ్చా మ‌చ్చా’ ప్రోమో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ తెలియ‌జేశారు. ప‌ల్ల‌విలోని లైన్స్ చూస్తుంటే.. మ్యూజిక‌ల్ సెన్సేష‌న్ త‌మ‌న్ నుంచి సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ మూవీ నుంచి ప‌క్కా మాస్ బీట్ సాంగ్ ఆడియెన్స్‌ను అల‌రించ‌బోతుంద‌ని అర్థ‌మ‌వుతుంది. ఈ పాట‌ను ప్ర‌ముఖ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ రాశారు. 
 
 ఇప్ప‌టికే ‘గేమ్ చేంజర్’ నుంచి  వచ్చిన ‘జరగండి జరగండి..’ పాట ఎంత సెన్సేష‌న్ అయ్యిందో అంద‌రికీ తెలిసిందే. తాజాగా సెకండ్ సాంగ్‌కు సంబంధించిన అప్‌డేట్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్ష‌కుల్లోనూ స‌రికొత్త ఎన‌ర్జీనిచ్చింది.  విన‌య విధేయ రామ చిత్రంలో జోడీగా మెప్పించిన రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ.. గేమ్ ఛేంజ‌ర్‌లో అల‌రించ‌టానికి రెడీ అయ్యారు. ఈ క్యూట్ పెయిర్ సంద‌డిని సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూడాల‌నే ఉత్సాహం అంద‌రిలోనూ క‌నిపిస్తోంది. ఇయ‌ర్ ఎండింగ్‌లో క్రిస్మ‌స్ సెల‌బ్రేష‌న్స్ టు న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ అన్నీ మావే అనే కాన్ఫిడెన్స్  క‌నిపిస్తోంది గేమ్ ఛేంజ‌ర్ యూనిట్ లో.
 
సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ప్రముఖ ఆడియో కంపెనీ సారేగమ ఈ సినిమా ఆడియో రైట్స్‌ను ఫ్యాన్సీ ప్రైజ్‌కి దక్కించుకుంది.
 
న‌టీ న‌టులు: రామ్ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ, అంజ‌లి, సముద్ర‌ఖ‌ని, ఎస్‌.జె.సూర్య‌, శ్రీకాంత్‌, సునీల్‌, జయరాం, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు