ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 7 సెప్టెంబరు 2024 (16:28 IST)

గేమ్ చేంజర్’ సెకండ్ సింగిల్ ఈ సెప్టెంబర్‌లోనే అంటూ పోస్టర్ విడుదల

Gamchanger poster
Gamchanger poster
రామ్ చరణ్, శంకర్ షణ్ముగ్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ ఛేంజర్ గురించి తాజా అప్ డేట్ వినాయకచవితినాడు నిర్మాతలు ప్రకటించారు. రామ్ చరణ్ డాన్స్ వేస్తున్న పోస్టర్ ను విడుదలచేసి సెకండ్ సింగిల్ ఈ సెప్టెంబర్‌లోనే అంటూ తెలియజేశారు. ఈ సినిమా గురించి ఇప్పటివరకు రకరకాలుగా వార్తలు వస్తూనే వున్నాయి.
 
ఈ పోస్టర్ కూడా రామ్ చరణ్ తలకు ఎర్ర కండువా కట్టి.. ‘జనసేన’కు లింక్ అయ్యేలా చేయడమే కాకుండా.. జాతరకు సిద్ధమవ్వండి అనేలా జాతర సెటప్‌తో.. చరణ్ స్టెప్ వేస్తున్న పిక్‌ని మేకర్స్ వదిలారు. ఇప్పటివరకు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు ఈ అప్ డేట్ బ్రేక్ ఇచ్చినట్లయింది. కియారా అద్వానీ నాయికగా నటించిన ఈ సినిమాకు థమన్ బాణీలు సమకూర్చారు. ఎస్.వి. సి. క్రియేషన్స్ పై ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు.