ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 28 సెప్టెంబరు 2024 (11:01 IST)

చిరుత వేడుకలు జరుపుకుంటున్న రామ్ చరణ్ తేజ్ అభిమానులు

chiruta 17 years poster
chiruta 17 years poster
మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి వారసుడిగా ఆయన కుమారుడు రామ్ చరణ్ తేజ్ తొలి చిత్రంగా చిరుత పెద్దయెత్తున అంచనాలతో, పబ్లిసిటీతో, అభిమానుల ఆర్భాటాల మధ్య విడుదలయ్యింది.17 ఏళ్ల క్రితం ఇదే రోజున, గ్లోబల్ స్టార్ ఎదుగుదలను ప్రపంచం చూసింది. రామ్‌చరణ్‌ని ప్రపంచానికి పరిచయం చేసిన ఐకానిక్ చిత్రం చిరుత. బాక్సాఫీస్‌ను తుఫానుగా తీసుకెళ్లి అద్భుతమైన సినీ ప్రయాణానికి వేదికగా నిలిచింది.
 
ఇదేరోజు 17 ఏళ్ళనాడు విడుదలైన రామ్ చరణ్ తేజ్ సినిమా సందర్భంగా ఆంధ్రాలోని కొన్ని జిల్లాలలో ఆయన అభిమానులు కేక్ లు కట్ చేసి వయోవ్రుద్ధులకు పండ్లు, ఫలహారాలు అందిస్తున్నారు. మరోవైపు ఆయన అభిమానులు చిరంజీవి బ్లడ్ బ్లాంక్ లో రక్తదానం నిర్వహిస్తున్నారు. కాగా, రామ్ చరణ్ తేజ్ ను కథానాయకుడిగా పరిచయం చేస్తానని ముందుగానే ప్రకటన చేసిన వైజయంతి మూవీస్ బేనర్ పై అశ్వనీదత్ నిర్మించారు. నేహాశర్మ, ప్రకాష్ రాజ్, ఎం.ఎస్. నారాయణ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు.