గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024 (18:19 IST)

ప్రభాస్ కల్కి సినిమా లీకులపై అశ్వనీదత్ ఫైర్ ?

Prabhas
Prabhas
ప్రభాస్ తో ప్రతిష్టాత్మకంగా వైజయంతి మూవీస్ లో అశ్వనీదత్ నిర్మిస్తున్న చిత్రం కల్కి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హాలీవుడ్ ఎవెంజర్ తరహాలో వుండబోతుంది. సైన్స్ ఫిక్షన్ గా రూపొందుతోన్న ఈ చిత్రంలోని గ్రాఫిక్స్, విజువల్ వర్క్ దేశంతోపాటు విదేశాలలోనూ జరుగుతుంది. కాగా, కొద్దిరోజులనాడు కల్కి లోని యాక్షన్ సీన్స్ లీకులు వచ్చాయని టాక్ నెలకొంది. దీనితో బాగా పరిశీలించిన నిర్మాత అశ్వినీదత్ గ్రాఫిక్ వర్క్ చేసే ఓ కంపెనీపై నోటీసు ఇచ్చి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
 
దానితో ప్రభాస్ అభిమానులు ఎలెర్ట్ అయ్యారు. యాక్షన్ సన్నివేశాలలో ప్రభాస్ వర్గం, ప్రత్యర్థి వర్గం వేరు వేరు దుస్తులతో ఫైట్ చేసే సీన్ అది. ఇది కావాలనే లీక్ చేశారా? లేదా మరో కోణం వుందా? అనేది ప్రశ్నగా మారింది. కానీ లీక్ అయిన కొద్దిసేపటికే సోషల్ మీడియా నుంచి తీసేశారని తెలిసింది.
 
అయితే పబ్లిక్ నోటీసు ఇవ్వడంవల్ల జరిగేది ఏమీ వుండదనీ, చర్యలు తీసుకోవాలని రెబల్ స్టార్ ఫ్యాన్స్ కోరుతున్నారు. కాగా, ఫిబ్రవరి 18 న కల్కి షూట్ లో ప్రభాస్ ప్రవేశించనున్నారని తెలుస్తోంది.