శుక్రవారం, 1 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 ఫిబ్రవరి 2024 (19:22 IST)

ప్రభాస్- దిశా పటానీలపై రొమాంటి సాంగ్.. అంతా కల్కి కోసమే?

Disha Patani_prabhas
Disha Patani_prabhas
ప్రభాస్- దీపికా పదుకొనే ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ డ్రామా కల్కి 2898 AD కోసం పని చేస్తున్నారు. ఈ సినిమాలో దిశా పటానీ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామాలో ఎంఎస్ ధోని ఫేమ్ గర్ల్ కీలక పాత్రలో అచ్చం తెలుగమ్మాయిలా కనిపించబోతుందట. 
 
అంతేగాకుండా ప్రభాస్, దిశా పటానిలపై రొమాంటిక్ సాంగ్ అతి త్వరలో యూరప్‌లో షూట్ చేయనున్నారని తెలిసింది. ప్రస్తుతం మేకర్స్ కల్కి 2898 AD పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. VFX గ్రాఫిక్స్ కారణంగా కల్కి 2898 AD ఆలస్యం అవుతోంది. 
 
ఈ చిత్రంలో భారీ తారాగణం ఉంది. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ విలన్‌గా నటిస్తుండగా, బిగ్ బిఅమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అశ్వినీ దత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మే 9న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కల్కి విడుదల కానుంది.