మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (12:09 IST)

కల్కి 2898 ADలో మృణాల్ ఠాకూర్.. ప్రభాస్ సరసన నటిస్తుందా?

Mrunal Thakur
కల్కి 2898 AD సినిమాపై భారీ అంచనాలున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కొత్త హంగులు చేరుతున్నాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ మరిన్ని ఆకర్షణలను జోడించి, కీలక పాత్రల కోసం పలువురు ప్రముఖ తారలను రంగంలోకి దించుతున్నాడు. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ వంటి నటీనటులు ఈ మెగా ప్రాజెక్ట్‌లో పాల్గొనడానికి ఇప్పటికే అంగీకరించారు. వారు కల్కిలో అతిధి పాత్రల్లో కనిపిస్తారు.
 
తాజాగా ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ చిన్న పాత్రలో నటించే అవకాశం ఉంది. మృణాల్ ఠాకూర్ అతిధి పాత్రపై ఊహాగానాలు పెరుగుతున్నాయి. మరి ఇందులో ఏమైనా నిజం ఉందో లేదో చూడాలి. మృణాల్ ఠాకూర్ సీతా రామంలో కనిపించింది. 
 
ఇక కల్కి తదుపరి దశ షూటింగ్ ఫిబ్రవరి 12, 2024న ప్రారంభమవుతుంది."కల్కి 2898 AD"లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 09, 2024న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.