బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 జనవరి 2024 (14:41 IST)

ప్రభాస్ సరసన శ్రీలీల.. ఆమె ఓవర్ డోస్ వద్దే వద్దు..

Sreeleela
ప్రభాస్ చేయబోయే ప్రాజెక్ట్‌ల లిస్ట్ చాలానే ఉంది. వాటిలో "సీతారామం" విజయంతో గుర్తింపు పొందిన హను రాఘవపూడి దర్శకత్వం వహించిన పేరులేని చిత్రం కూడా వుంది. సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించేందుకు శ్రీలీలాను హను రాఘవపూడి సంప్రదించడం విశేషం. 
 
కానీ ఆమె ఇంకా సంతకం చేయలేదు. ఆమె పేరును కూడా మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. అయితే, ప్రభాస్ అభిమానులు ఇప్పటికే ఆమెకు వ్యతిరేకంగా హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్ చేయడం ప్రారంభించారు. ఇటీవల తెరపై శ్రీలీల ఓవర్ డోస్ ఉందని అభిమానులు విశ్వసిస్తున్నారు.