బుధవారం, 3 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 31 జులై 2025 (11:51 IST)

13 ఏళ్ల బాలికను 40 ఏళ్ల వ్యక్తికిచ్చి వివాహం, అత్తారింటికి వెళ్లనన్న బాలిక

child marriage
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో దారుణ ఘటన జరిగింది. 13 ఏళ్ల వయసున్న బాలికను 40 ఏళ్ల వయసున్న వ్యక్తికిచ్చి వివాహం చేసిన ఘటన వెలుగుచూసింది. 8వ తరగతి చదువుతున్న బాలికను చేవెళ్ల మండలం కందిపాడుకు చెందిన 40 ఏళ్ల శ్రీనివాస్ గౌడ్ కిచ్చి పెళ్లి జరిపించారు. పెళ్లయిన తర్వాత అతడితో బాలికను అత్తవారింటికి పంపేందుకు సన్నాహాలు చేసారు. 
 
కానీ బాలిక అత్తారింటికి వెళ్లేందుకు ససేమిరా అనడంతో విషయం కాస్తా ఉపాధ్యాయుల దృష్టికి వెళ్లింది. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు బాధిత బాలిక తల్లితో పాటు పెళ్లి చేసుకున్న వరుడు శ్రీనివాస్ గౌడ్, పురోహితుడు ఆంజనేయులు, సంబంధం చూసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికను సఖి కేంద్రానికి తరలించారు.