గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 అక్టోబరు 2024 (15:06 IST)

10వ తరగతి బాలికకు 24 ఏళ్ల వ్యక్తితో పెళ్లి.. గర్భవతి అయి వుంటుందా?

child marriage
ఆధునికత పెరిగినా, టెక్నాలజీ వచ్చినా పాత పద్ధతులు మారట్లేదు. తాజాగా కామారెడ్డిలో బాల్య వివాహ వుదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి రామారెడ్డి మండలంలో 10వ తరగతి చదువుతున్న బాలికకు తల్లిదండ్రులు 24 ఏళ్ల యువకుడితో వివాహం జరిపించిన బాల్యవివాహం ఉదంతం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివాహం తెల్లవారుజామున 3 గంటలకు జరిగినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు రహస్యంగా వేడుకను నిర్వహించారు. అయితే, బాలిక గర్భవతి అయి ఉండొచ్చని అనుమానించిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) అధికారులు కొద్దిసేపటికే పెళ్లిని నిలిపివేశారు. 
 
ఈ అనుమానాన్ని నిర్ధారించేందుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. అధికారులు కేసు నమోదు చేసి యువతి, వరుడి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. విచారణ కొనసాగుతున్నందున మైనర్ బాలికను ప్రభుత్వ ఆశ్రయం బాలసదన్‌కు తరలించారు.