ఆదివారం, 19 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 సెప్టెంబరు 2024 (16:31 IST)

ఆస్తి తగాదాలు.. ముగ్గురు హతం.. గర్భవతి అని కూడా చూడకుండా?

crime photo
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో ఆస్తి తగాదాల కారణంగా 40 ఏళ్ల అన్నయ్య, గర్భవతి అయిన వదిన.. వారి మైనర్ కొడుకును చంపినందుకు ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు కుటుంబ సభ్యుల మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతులు మదన్ పాటిల్, అతని 35 ఏళ్ల భార్య, 11 ఏళ్ల కుమారుడని గుర్తించారు. 
 
బాధితులపై గొడ్డలితో దాడి చేశారని, దీంతో తలకు గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిందితుడు 
మదన్ పాటిల్ సోదరుడు హనుమంత్ పాటిల్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 
 
ఆస్తి వివాదమే ఈ హత్యలకు కారణమని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. సిసిటివి కెమెరా ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.