ఆదివారం, 2 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 సెప్టెంబరు 2024 (10:07 IST)

తిరుచానూరులో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవం సందర్భంగా మంగళవారం సంప్రదాయ ఆలయ శుద్ధి ఉత్సవం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. సెప్టెంబర్ 15న అంకురార్పణంతో పవిత్రోత్సవం సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. 
 
ఈ క్రతువుకు ముందు కల్యాణోత్సవం, ఊంజల్ సేవను టీటీడీ రద్దు చేసింది. కాగా, హైదరాబాద్‌కు చెందిన స్వర్ణ కుమార్ రెడ్డి అనే భక్తుడు తిరుచానూరు ఆలయానికి 11 పరదాలు (పర్దాలు) విరాళంగా ఇచ్చారు. ఆలయ ఏఈవో రమేష్, సూపరింటెండెంట్ శేషగిరి, అర్చకులు పాల్గొన్నారు.
 
సెప్టెంబ‌రు 15న సాయంత్రం ప‌విత్రోత్సవాల‌కు అంకురార్పణ జరుగుతుందని పేర్కొన్నారు. సెప్టెంబ‌రు 16న పవిత్ర ప్రతిష్ఠ, 17న పవిత్ర సమర్పణ, 18న మహాపూర్ణాహుతి నిర్వహణ ఉంటుందని తెలిపారు.