బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 సెప్టెంబరు 2024 (16:01 IST)

డాక్టర్‌పై ఒక పేషెంట్‌ బంధువులు దాడి.. ఎందుకో తెలుసా? (video)

Chikkamagaluru
Chikkamagaluru
తిరుపతిలో ఓ మహిళా డాక్టర్‌పై తాగుబోతు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను మరవకముందే.. కర్ణాటకలో ఒక డాక్టర్‌పై ఒక పేషెంట్‌ బంధువులు దాడికి దిగిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
 
కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా ఆసుపత్రిలో డాక్టర్‌పై రోగి బంధువులు దాడి చేశారు. ఆస్పత్రికి వచ్చిన ఇర్షాద్ అనే పేషెంట్‌ను అతడి బంధువులు తీసుకొచ్చారు. డాక్టర్ గదిలోకి ఒకేసారి ఎక్కువ మంది వచ్చారు. వారిని బయటకు వెళ్లమని ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ డాక్టర్ వెంకటేష్ కోరారు. 
 
అయితే పేషెంట్ బంధువులు డాక్టర్‌ చెప్పే మాటలను పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే డాక్టర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఓ మహిళ ఆ డాక్టర్‌ను చెప్పుతో కొట్టింది. 
 
దీంతో వైద్యులు ఆసుపత్రి మూసి వేసి ధర్నా చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు.