ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (12:20 IST)

పక్కింటి బాలుడిని వాషింగ్ మెషీన్‌లో దాచేసిన మహిళ.. చివరికి?

crime scene
తమిళనాడులోని తిరునెల్వేలిలో ఘోరం జరిగింది. ఓ మహిళ అభం శుభం తెలియని పసికందును దారుణంగా హత్య చేసింది. అనంతరం ఏమీ తెలియనట్లు మృతదేహాన్ని తన ఇంట్లోని వాషింగ్‌ మెషిన్‌లో దాచింది. బాలుడు కనిపించలేదని.. చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరునెల్వేలిలో ఆతుకురిచ్చి గ్రామంలో తంగమ్మాళ్ (40) అనే మహిళ జీవనం సాగిస్తోంది. ఆమె బిడ్డ కొన్నాళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించింది. అయితే తన పక్కింటిలో ఉన్న విఘ్నేష్‌ అనే వ్యక్తి వల్ల తంగమ్మాళ్ బిడ్డను కోల్పోయింది. దీంతో విఘ్నేశ్‌పై పగను పెంచుకున్న తంగమ్మాళ్.. ఆయన బిడ్డను వాషింగ్ మెషీన్‌లో దాచేసింది. 
 
తమ బిడ్డ కనిపించకుండా పోవడంపై పొరుగింట్లో ఉంటున్న తంగమ్మాళ్‌ హస్తం ఉందన్న సందేహాలను కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు తంగమ్మాళ్‌ ఇంట్లో సోదాలు చేశారు. ఈ క్రమంలో ఆమె ఇంట్లోని వాషింగ్‌ మెషిన్‌లో బాలుడు సంజయ్‌ మృతదేహాన్ని గుర్తించారు. 
 
పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ కేసులో ఇతరుల ప్రమేయం ఉందేమోనన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.