బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 20 జనవరి 2024 (14:44 IST)

ప్రభాస్ 'కల్కి' చిత్రంలో విజయ్ దేవరకొండ, నిజమేనా?

Vijay Devarakonda
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898 AD. అంటే... కృష్ణావతారం తర్వాత వచ్చే అవతారం కల్కి. ఈ అవతారాన్ని ఆధారం చేసుకుని రూపొందిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో హీరోయిన్ దీపికా పదుకునె. విశ్వనాయకడు కమల్ హాసన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ వంటి అగ్రతారలు ఇందులో నటిస్తున్నారు.
 
ఇక అసలు విషయానికి వస్తే... టాలీవుడ్ కండలవీరుడు విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. గతంలో విజయ్ దేవరకొండను దర్శకుడు నాగ్ అశ్విన్ ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి చిత్రాల్లో నటింపజేసారు. ఇప్పుడు కల్కి చిత్రంలోనూ కీలక పాత్రలో నటింపజేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన కొన్ని సీన్లలో ప్రస్తుతం విజయ్ నటిస్తున్నట్లు సమచారం.