ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 12 జనవరి 2024 (17:00 IST)

రైడర్‌ల ద్వారా గ్రాండ్ రిలీజ్ డేట్ ప్రకటించిన కల్కి 2898 AD నిర్మాతలు

Kalki 2898 AD release date poster
Kalki 2898 AD release date poster
విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్  దర్శకత్వంలో రూపొందుతున్న లార్జ్ దెన్ లైఫ్, ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’ విడుదల తేదీని చాలా గ్రాండ్ గా అనౌన్స్ చేశారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె,  దిశా పటానీ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం అద్భుతమైన సినిమా అనుభవాన్ని అందిస్తుంది.

'కల్కి 2898 AD' నిర్మాతలు వారణాసి, ముంబై, ఢిల్లీ, చండీగఢ్, చెన్నై, మదురై, హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూరు, భీమవరం, విజయవాడ, కాశ్మీర్‌తో సహా పాన్-ఇండియాలోని పలు నగరాల్లో రైడర్‌ల ద్వారా గ్రాండ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈవెంట్ సందర్భంగా, రైడర్‌లు కలిసి కవాతు చేశారు ఎక్సయిమెంట్ ని మరింతగా పెంచారు. అద్భుతమైన రీతిలో చిత్రం విడుదల తేదీని మే 9, 2024గా అనౌన్స్ చేశారు.
 
వైజయంతీ మూవీస్ వ్యవస్థాపకులు, నిర్మాత సి. అశ్విని దత్ విడుదల తేదీ గురించి తెలియజేస్తూ “వైజయంతీ మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, మా సినిమా ప్రయాణంలో మే 9కి ఉన్న ప్రాముఖ్యత స్పష్టంగా కనిపిస్తుంది. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ నుండి అవార్డులు గెలుచుకున్న ‘మహానటి’, ‘మహర్షి’ వరకు ఈ తేదీ చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరం చేసింది. ఇప్పుడు, అమితాబ్ బచ్చన్, ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొణె వంటి ప్రతిభావంతులైన ఆర్టిస్టులు కలిసి నటిస్తున్న 'కల్కి 2898 AD' విడుదల ఒక ప్రత్యేక ముద్ర వేసుకుంది. బ్యానర్ మైలురాయి 50వ సంవత్సరానికి అనుగుణంగా, వైజయంతీ మూవీస్ ప్రయాణాన్ని మరింత అర్థవంతంగా చేస్తుంది' అన్నారు
 
'కల్కి 2898 AD' గత సంవత్సరం శాన్ డియాగో కామిక్-కాన్‌లో సంచలనం సృష్టించింది. టీజర్ గ్లింప్స్ ఇది ప్రపంచవ్యాప్త ప్రశంసలను పొందింది. ఈ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
 
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, వైజయంతీ మూవీస్ నిర్మించిన 'కల్కి 2898 AD' మైథాలజీ ఇన్స్పైర్డ్ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా ప్రేక్షకులకు దృశ్యకావ్యాన్ని అందించబోతుంది.