శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 జనవరి 2024 (10:38 IST)

ప్రభాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. అంతా డార్లింగ్ వల్లే..

Prabhas-kalki
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్. "కల్కి 2898 ఏడీ" కోసం ఫ్యాన్స్ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా జనవరిలో వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ మరోసారి ఈ సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది. సలార్ సినిమా కారణంగానే కల్కి విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. సలార్ సినిమా విడుదలై ఎక్కువ రోజులు కాలేదని.. ఈ తక్కువ వ్యవధిలోనే కల్కి 2898 ఏడీని విడుదల చేస్తే సలార్‌పై ప్రభావం చూపుతుందని ప్రభాస్ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది 
 
సలార్ సక్సెస్‌పై ఎలాంటి ప్రభావం పడకూడదంటే కాస్త గ్యాప్ తీసుకొని "కల్కి 2898 ఏడీ"ను విడుదల చేయడం మంచిదని ప్రభాస్ సూచించినట్టు తెలుస్తోంది. దీంతో మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో సినిమా విడుదల కోసం తగిన తేదీలను చిత్ర నిర్మాతలు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
కాగా "కల్కి 2898 ఏడీ" సినిమాని రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించారని టాక్ వస్తోంది. ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా వైజయంతి మూవీస్ నిర్మించింది. ఇక దీపికా పదుకొణే, అమితాబ్ బచ్చన్‌, దిశా పటానీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.