శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 31 డిశెంబరు 2023 (15:29 IST)

"సలార్"పై 100 శాతం సంతృప్తి లేదు : దర్శకుడు ప్రశాంత్ నీల్ కామెంట్స్

Salaar Cease Fire movie review
ప్రభాస్ హీరోగా నటించిన "సలార్‌"కు వస్తున్న రెస్పాన్స్ గురించి తాజాగా ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ స్పందించారు. ఇదే విషయంపై ప్రభాస్‍తో మాట్లాడానని చెప్పారు. సినిమా కలెక్షన్ల గురించి ముచ్చటించినట్టు వెల్లడించారు. ప్రభాస్ చాలా సంతోషించినట్టు తెలిపారు.
 
"సలార్"పై ప్రభాస్ చాలా సంతోషంగా ఉన్నారని. ఆయన రియాక్షన్ చాలా ఉత్సాహకరంగా ఉందని ప్రశాంత్ నీల్ చెప్పారు. అయితే తనకు మాత్రం 100 శాతం సంతృప్తి మాత్రం 'సలార్'పై లేదని.. తాను తెరకెక్కించిన చిత్రాలపై తనకు ఎప్పుడూ 100 శాతం సంతృప్తి ఉండదని ప్రశాంత్ నీల్ చెప్పారు.  ఇంకా కాస్త మెరుగ్గా ఉండాల్సిందేమోనని అనిపిస్తుందని అన్నారు. 
 
తనకే కాదని, ప్రతీ ఫిల్మ్ మేకర్‌కు అలాగే అనిపిస్తుందని చెప్పారు. 'ఫిల్మ్స్ మేకర్ అయినా పూర్తిస్థాయిలో సంతృప్తి చెందరు. అలాగే, నేను కూడా పూర్తిగా సాటిసిఫై కాలేదు. 'కేజీఎఫ్ 2' ఔట్ పుట్ విషయంలో కూడా తాను సంతృప్తి చెందలేదని ప్రశాంత్ నీల్ వెల్లడించారు. 
 
అయితే, ప్రభాస్ పోషించిన దేవా క్యారెక్టర్ విషయంలో తాను చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు. 'సలార్' రెండో పార్ట్ ఇంకా భారీగా ఉంటుందని, ఆ కథ అలాంటిదని నీల్ చెప్పారు. ఇక ప్రపంచవ్యాప్తంగా "సలార్" రూ.550 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్కును దాటేసిన విషయం తెల్సిందే.