బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 డిశెంబరు 2023 (17:28 IST)

ప్రభాస్ సలార్ సంచలనం.. 3 రోజుల్లో రూ.402 కోట్లు

salaar movie
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "సలార్". ఈ చిత్రం గత శుక్రవారం విడుదలై కేవలం మూడు రోజుల్లో ఏకంగా రూ.402 కోట్ల మేరకు వసూళ్లు రాబట్టింది. సోమవారం కూడా క్రిస్మస్ పండుగ సెలవు కావడంతో రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూలవుతున్నాయి. దీంతో ఈ చిత్రం వెయ్యి కోట్ల రూపాయల మేరకు వసూళ్లు సాధించడం ఖాయమనే టాక్ వినిపిస్తుంది. 
 
'బాహుబలి' చిత్రం తర్వాత ప్రభాస్ నటించిన మూడు పాన్ ఇండియా చిత్రాలు తీవ్ర నిరాశకు గురిచేయాయి. దీంతో సలార్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రం విడుదలైన తర్వాత అందరి అంచనాలకు అనుగుణంగానే ఈ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబడుతుంది. చాలా గ్యాప్ తర్వాత రావడంతో ఆయన అభిమానులు కోరుకున్నట్టుగానే ఈ చిత్రంలో ప్రభాస్ కనిపించారు. తారాగణంపరంగా, ఫైట్స్ పరంగా ఈ సినిమా భారీతనాన్ని ఆవిష్కరించింది. రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్‌‍ను ప్రభాస్ కెరీయర్‌లో సాధించారు. 
 
ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం మూడు రోజుల్లో రూ.402 కోట్ల మేరకు వసూళ్లు రాబట్టింది. క్రిస్మస్ రోజున కూడా సెలవు కావడంతో కలెక్షన్లు కూడా తగ్గే అవకాశం లేదు. ఆ తర్వాత అంటే ఈ వారాంతం వరకు ఇదే జోరు కనబరిచే అవకాశం ఉంది. ఫలితంగా చాలా వేగంగా ఈ చిత్రం రూ.1000 కోట్ల జాబితాలో చేరిపోతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.