గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 డిశెంబరు 2023 (13:59 IST)

బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ కేసులో మరో ముగ్గురి అరెస్టు

pallavi prashanth
బిగ్ బాస్ 7 సీజన్ గ్రాండ్ ఫినాలే రోజున అన్నపూర్ణ స్టూడియోస్ వెలుపల జరిగిన గొడవ కేసులో టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌ను అరెస్టు చేశారు. ఇదే కేసులో మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. యూసుఫ్ గూడకు చెందిన సుధాకర్, పవన్, సరూర్ నగర్‌కు చెందిన అవినాశ్ రెడ్డిలను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ వెలుపల జరిగిన ధ్వంసం, దాడికి సంబంధించిన ఘటనలో రెండు కేసులు నమోదు కాగా, ఇప్పటివరకు 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 
 
మరోవైపు, పల్లవి ప్రశాంత్‌కు రెండు రోజుల క్రితం నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు హాజరై సంతకాలు చేయాలని కోర్టు ఆదేశించింది. కొన్ని రోజుల పాటు ఇంటర్వ్యూలు ఇవ్వరాదన్న షరతు విధించింది. బెయిల్‌పై బయట ఉన్న ప్రశాంత్ తన ఊరిలో ఉన్నాడు.