1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 30 డిశెంబరు 2023 (15:56 IST)

వరదరాజ మన్నార్ నుండి నజీబ్ వరకు పృథ్వీరాజ్ సుకుమారన్ లైఫ్

Prithviraj Sukumaran
Prithviraj Sukumaran
సాలార్ లో వరదరాజ మన్నార్ అనే రాజు నుండి ది గోట్ లైఫ్ లో బానిస వరకు పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర భిన్నమైనది. రాజు పాత్రలో అప్పటి ఆహార్యంలో హుందా తనం వున్న చేయడానికి బానిసలు లాంటి పనోళ్ళు వుంటారు. కానీ ది గోట్ లైఫ్ అనే సినిమాలో తనే మేకలా జీవితాన్ని సాగించాల్సి వస్తుంది. ఈ వేరియషన్స్ ను తెలియజేస్తూ చిత్ర టీమ్ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. రాజు నుంచి బానిస వరకు అనే పేరు పెట్టింది.
 
పృథ్వీరాజ్ సుకుమారన్ ది గోట్ లైఫ్ చిత్రీకరణ సమయంలో శారీరక,మానసిక పరివర్తన అతనిని నిజమైన G.O.A.T. లా వుంటుంది. ఎక్కడో చక్కటి పొలాలమధ్య గ్రామీణ ప్రాంతంలో ప్రేయసితో హాయిగా గడిపే ఆయన జీవితం ఒక్కసారిగా ఎడాదిమయం అవుతుంది. అక్కడ నుంచి అతని జీవితమే మారిపోతుంది. కింద కాలుతున్న ఇసుక పైన వేడిమి రగిలించే సూర్యుడు వున్నా ఒంటలు, గొర్రెలు కాపరిగా బానిస జీవితాన్ని గడిపే కథతో ది గోట్ లైఫ్ రూపొందుతోంది. ఇటీవలే విడుదలైన టీజర్ కు మంచి స్పందన లభించింది. 
 
2024 లో విడుదలకాబోతున్న ఈ సినిమాకు మలయాళంలో ఆడుజీవితం అని కూడా పేరు పెట్టబడింది, ఇది బ్లెస్సీ రచించి, దర్శకత్వం వహించి, సహనిర్మాతగా రూపొందిన రాబోయే మనుగడ డ్రామా చిత్రం. ఈ చిత్రం భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్‌లోని కంపెనీలతో కూడిన అంతర్జాతీయ సహ-నిర్మాణం, అరబిక్,  మలయాళ భాషలలో రూపొందుతోంది. ఇది ఎడారి ప్రాంతంలో బతుకుతున్న చాలామంది జీవితాలకు కనువిప్పుగా వుంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. దీనికి రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు.