బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 4 జనవరి 2024 (16:55 IST)

ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాలో అదిరిపోయే అప్ డేట్స్ ఇవే!

chiru, tej - hanuman poster
chiru, tej - hanuman poster
దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రతిష్టాత్మక తీసిన చిత్రం హనుమాన్. ఓ సామాన్యునికి అతీంద్రశక్తులు వుంటే ఎలా వుంటుందనే కోణంలో సినిమా రూపొందింది. వరలక్మి శరత్ కుమార్ సోదరుడిగా తేజ్ సజ్జ నటించాడు. ఈ సినిమా ఆరు నూరైనా సంక్రాంతికి వస్తుందనీ చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి తెలియజేస్తున్నారు. పంపిణీదారులతో, ఎగ్జిబిటర్లతో చర్చలు జరిగాయనీ, దిల్ రాజు కూడా సంప్రదింపులు జరిపారనీ, అయినా మేము గత ఏడాది జూన్ లోనే మా సినిమా డేట్ ప్రకటించామని అన్నారు.
 
ఇదిలా వుండగా, ఈ సినిమాలో ప్రముఖ హీరోల పాత్ర ఎంతో వుంది. ఎన్.టి.ఆర్.కు ఈ సినిమాను అంకితమిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మహేష్ బాబుకు, రవితేజకు థ్యాంక్స్ చెబుతూ స్లయిడ్ వేయనున్నారు. దీనికి తోడు బాలీవుడ్ లో ఈ సినిమా ప్రమోషన్ మొదలయ్యాయి. అక్కడ అంతా బిజినెస్ పూర్తయింది. అయోధ్య రామాలయం ఏర్పాట్లు కూడా పూర్తికావస్తున్నాయి. ఈ సందర్భంగా ఆదిపురుష్ తీసిని ఓంరౌత్ తో పాటు పలువురు ఆశీస్సులు కూడా ఈ సినిమాకు మెండుగా వున్నాయి.
 
అయితే అంతకంటే మరో విశేషం ఏమంటే, మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఈ సినిమా ప్రీరిలీజ్ కు చిరంజీవి ముఖ్య అతిథి. ఇంకోవైపు ప్రభాస్ కు ఆహ్వానం అందింది. ఆయన వీలును బట్టిరావచ్చని తెలుస్తోంది. ఇదంతా ఒక ఎత్తయితే మెగాస్టార్ చిరంజీవి హనుమాన్ సినిమాలో కన్పించనున్నారు. అది ఎలా? అనేది పాఠకులు ఊహించుకోవచ్చు. సో.. హనుమంతుని భక్తుడైన చిరంజీవి ఈ సినిమాలో అదిరిపోయే విధంగా కన్పించనున్నారు. అదే ఈ సినిమాకు హైలైట్ కానున్నదని తెలుస్తోంది.