బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 జనవరి 2024 (19:41 IST)

నరసాపురం పార్లమెంట్ టికెట్ రేసులో ప్రభాస్ పెద్దమ్మ?

shyamala devi
ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. నరసాపురం పార్లమెంట్ టికెట్ కోసం ఆసక్తికర వార్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘురామ కృష్ణంరాజు గెలుపొందారు. అయితే.. విజయం సాధించిన కొన్ని రోజులకే ఆయన ఆ పార్టీని విభేదించారు. 
 
సీఎం జగన్‌ను టార్గెట్ చేశారు. ఈ క్రమంలో ఆయన టీడీపీకి దగ్గరయ్యారు. టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఈ సారి ఆయన బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈసారి వైసీపీ టికెట్ ఎవరికి దక్కుతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
 
ప్రముఖ యువహీరో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలదేవి వైసీపీ టికెట్ రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే స్థానం నుంచి శ్యామలాదేవి భర్త కృష్ణం రాజు 1999లో ఎంపీగా గెలుపొందారు. 
 
వీరితో పాటు వైసీపీ టికెట్ రేసులో గోకరాజు గంగరాజు కుమారుడు గోకరాజు వెంకట కనక రంగరాజు కూడా టికెట్ రేసులో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ఈ సీటు జగన్ ఎవరికిస్తారనే దానిపై ప్రస్తుతం చర్చ సాగుతోంది.