ఆదివారం, 2 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 15 డిశెంబరు 2023 (11:08 IST)

అలిపిరి మెట్లెక్కి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దీపికా పదుకునె

Deepika Padukone
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునె గురువారం రాత్రి శ్రీవారి అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకి వెళ్లారు. ఆమె వెంట ఆమె సోదరి అనిషా పదుకునె కూడా వచ్చారు. తను, తన సోదరి ఇద్దరూ కలిసి అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకున్నారు.
 
శుక్రవారం ఉదయం సుప్రభాతం సేవలో శ్రీ తిరుమలేశుని దర్శించుకున్నారు. తితిదే అధికారులు దీపికా పదుకునెకి తీర్థప్రసాదాలు అందించారు.