సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 ఆగస్టు 2023 (19:40 IST)

ఫైటర్ టీజర్ రిలీజ్.. లుక్స్ అదుర్స్ అంటోన్న ప్రేక్షకులు

Fighter Teaser
Fighter Teaser
బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, దీపికా పదుకొణే తొలిసారి జంటగా నటిస్తున్న సినిమా ఫైటర్. ఈ సినిమాపై ప్రేక్షకుల మధ్య భారీ అంచనాలున్నాయి. హృతిక్‌తో బ్యాంగ్ బ్యాంగ్, వార్ సినిమాలు తీసిన డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వ పగ్గాలు చేపట్టారు. 
 
ఈ సినిమాలో హృతిక్ రోషన్ భారత ఎయిర్ ఫోర్స్ అధికారితో కనిపిస్తాడు. అంతేకాదు.. మన దేశంలో తొలిసారి ఏరియల్ యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కుతోంది. గాలిలో ఫైట్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వనుంది. హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా నిర్మాణం జరుగుతోంది. ఇందులో అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. 
Anil kapoor
Anil kapoor
 
తాజాగా విడుదల చేసిన ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. లుక్స్ చూసి ప్రేక్షకులు అదుర్స్ అంటున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. టీజర్ విడుదల చేశారు. ఇందులో హృతిక్, దీపికా లుక్స్, అనిల్ కపూర్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి.

Deepika padukone
Deepika padukone