సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 జులై 2023 (14:02 IST)

దీపికా పదుకునే బ్యాగులో కొకైన్ దొరికిందా?

deepika padukone
బాలీవుడ్ నటి దీపికా పదుకునేపై ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్‌లో మెంబర్‌గా ఉన్న ఉమైర్ సంధు సంచలన వ్యాఖ్యలు చేశారు. విమానాశ్రయ అధికారుల నుండి వచ్చిన అంతర్గత సమాచారం ప్రకారం, దీపికా పదుకునే బ్యాగులో కొకైన్ దొరికిందని ట్వీట్ చేశాడు. ఉమైర్ సంధు చేసిన ట్వీట్‌పై ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కొంత మంది వ్యక్తులు అతన్ని ట్రోల్ చేయడం ప్రారంభించారు. 
 
ఉమైర్ సంధును ఫేక్ అని నెటిజన్లు పిలుస్తున్నారు. ఉమైర్ సంధు వైరల్ ట్వీట్‌కు ప్రతిస్పందిస్తూ, బ్యాగులో కొకైన్ దొరికిందా? అంటూ ప్రశ్నించాడు. మరో ట్విట్టర్ యూజర్ ఈ వార్తలు నిజమేనని చెప్పారు. ప్రస్తుతం దీపికా పదుకునే పాన్ ఇండియా ఫిల్మ్ కల్కి 2898 డిలో ప్రభాస్‌తో కలిసి నటిస్తోంది.