గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 21 జులై 2023 (11:14 IST)

ప్రాజెక్ట్ కె.తో కల్కి 2898 అవతారంగా ప్రభాస్

kalki-prbahs
kalki-prbahs
ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కె. చిత్రం. ఈ చిత్రం వర్కింగ్ టైటిల్ పెట్టక వ్వాట్ యీజ్ ప్రాజెక్ట్ కె.అంటూ ప్రచారం జరిగింది. నిన్న అమెరికాలో ప్రమోషన్లో భాగంగా ముందుగా ప్రభాస్ స్టిల్ విడుదల చేశారు. దానికి నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. ప్రభాస్ లుక్ బాగోలేదని ఫాన్స్ కూడా డీలా పడిపోయారు. ఆ తర్వాత నిన్న రాత్రి ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. అందులో మానవులకు అంతం చేసే ఎదో శక్తి ఉన్నట్లు చూపించారు. వాటిని ఎదుర్కోవడానికి కల్కి అవరం ఎత్తినట్లు తెలుస్తోంది. 
 
ఈ సినిమాకు “కల్కి 2898” ని నిర్మాతలు హాలీవుడ్ ఈవెంట్ లో తెలిపారు. ఇందులో ప్రభాస్ ఇంటెన్స్ లుక్స్ కూడా ఫ్యాన్స్ కి మాత్రం ఓ రేంజ్ లో ట్రీట్ ని ఇస్తున్నాయి. చివరలో ప్రభాస్ లుక్ బాహుబలి గెటప్ కూడా గుర్తుకు వస్తుంది. మరి ఈ సినిమా కథ టైం ట్రావెల్ నేపథ్యం కనుక ఎంత కొత్తగా ఉంటుందో చూడాలి.