శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 20 జులై 2023 (10:26 IST)

త్రివిక్రమ్ కథతో హిరణ్యకశ్యప గా రానా దగ్గుబాటి

Rana - Hiranyakashyapa
Rana - Hiranyakashyapa
ఇప్పుడు పురాణ కథలు వెండితెరపై వస్తున్నాయి.  అందులో భాగంగా హిరణ్యకశ్యప చిత్రం రాబోతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కథతో 'హిరణ్యకశ్యప' సినిమా చేస్తున్నట్లు రానా దగ్గుబాటి అమెరికాలో తెలిపారు. కామిక్ కాన్ 2023లో ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. దాని గురించి పూర్తి వివరాలు రెలియజేయలేదు. దర్శకత్వంతో పాటు ఇతర వివరాలు ఇండియా వచ్చాక తెలియజేస్తామని అన్నారు.  
 
భల్లాలదేవ పాత్ర తర్వాత హిరణ్యకశ్యప పాత్ర రానా దగ్గుబాటి ను వెతుక్కుంటూ వచ్చింది. ఒకప్పుడు ఈ పాత్రలకు ఎస్ వ్. రంగారావు, ఎన్ .టి.ఆర్ ప్రసిద్ధి. ఇప్పటి జనరేషన్ కు రానా తగినవాడని త్రివిక్రమ్ ఓ సందర్భంలో తెలిపారు. ఇది రానాకు డ్రీమ్ ప్రాజెక్టు. అత్యంత  ఆసక్తికరమైన సినిమాగా సోషల్ మీడియాలో నెలకొంది.