1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 జులై 2023 (10:50 IST)

'ప్రాజెక్టు కె' నుంచి లేటెస్ట్ అప్డేట్.. కల్కి '2898 ఏడీ’ టైటిల్ ఖరారు (వీడియో)

Prabhas look
'ప్రాజెక్టు కె' నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీకి కల్కి '2898 ఏడీ’ (Kalki 2898 AD)' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ ను శాన్ డియాగోలోని కామిక్ కాన్ వేడుకలో శుక్ర‌వారం తెల్ల‌వారుజామున‌ విడుదల చేశారు. 
 
ఈ వీడియోలో యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. విజువల్ ఎఫెక్ట్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. ప్రభాస్ ఎంట్రీ అద్భుతంగా ఉంది. చివ‌రిలో 'వాట్ ఈజ్ ప్రాజెక్ట్ కె' అని ఓ వ్యక్తి అడగ్గా వెంటనే టైటిల్ రివీల్ చేయడం ఆకట్టుకుంటోంది.
 
అమెరికాలో ప్రతిష్ఠాత్మక 'శాన్‌ డియాగో కామిక్ కాన్‌’ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లోనే ప్రాజెక్టు-కె మేకర్స్ గ్లింప్స్‌, టైటిల్‌ని ప్రకటించారు.