బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 జనవరి 2024 (12:43 IST)

సలార్ 2: పవర్ ఫుల్‌ రోల్‌లో శ్రియా రెడ్డి

sriya reddy
సలార్ గత వారాంతంలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో సలార్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ చిత్రం ఓటీటీ వీక్షకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది. ఇంకా భారీ వీక్షణలను అందుకుంటుంది.
 
ఈ నేపథ్యంలో సలార్ బృందం రెండవ భాగాన్ని ప్రారంభించేందుకు ఉత్సాహంగా వున్నట్లు టాక్. ఈ చిత్రంలో శ్రీయా రెడ్డి పృథ్వీరాజ్ సుకుమారన్ సోదరిగా నటించింది. సలార్‌లో శ్రియారెడ్డి నటన సినిమాకు హైలైట్‌గా నిలిచింది. 
 
ఇదే తరహాలో సలార్ 2 పవర్ ఫుల్ రోల్‌లో శ్రియారెడ్డి కనిపించనుంది. సలార్ 2లో ప్రభాస్, పృథ్వీరాజ్ తరహాలో తన పాత్ర కీలకంగా వుంటుందని తెలుస్తోంది.